News June 16, 2024
నేటి నుంచి SAతో భారత్ వన్డే సిరీస్

నేటి నుంచి భారత మహిళల జట్టు SAతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇవాళ బెంగళూరు వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మూడు మ్యాచులు ఇదే వేదికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల బంగ్లాదేశ్‌ను టీ20ల్లో హర్మన్ సేన 5-0తో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి CM రేవంత్ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
News November 20, 2025
హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హన్స్‌రాజ్ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో 24 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, Lab అసిస్టెంట్, Jr అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్సైట్: hansrajcollege.ac.in/
News November 20, 2025
అరుదైన వైల్డ్‌లైఫ్ ఫొటో.. మీరూ చూసేయండి!

ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అత్యంత అరుదైన క్షణాన్ని బంధించారు. సెంట్రల్ అమెరికాలోని ‘కోస్టారికా’లో కనిపించే అత్యంత విషపూరితమైన పాము మీద దోమ వాలి.. ప్రశాంతంగా రక్తాన్ని పీల్చింది. ఇది గమనించిన ఫొటోగ్రాఫర్(twins_wild_lens) క్లిక్ మనిపించగా తెగ వైరలవుతోంది. ఈ రకం పాములు చెత్తలో కలిసిపోయి ఎంతో మంది ప్రాణాలు తీశాయని తెలిపారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిక్ వోల్కర్ కూడా ఈ ఫొటోను ప్రశంసించారు.


