News January 23, 2025
100 కోట్ల ఓటర్ల దిశగా భారత్

భారత్‌లో ఓటర్ల సంఖ్య 99.1కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18-29ఏళ్ల వయస్సున్న వారు ఏకంగా 21.7కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. భారత్ త్వరలోనే 100కోట్ల మంది ఓటర్లతో రికార్డ్ సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
Similar News
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News October 24, 2025
ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
News October 24, 2025
అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం