News February 24, 2025

టాప్‌లో భారత్.. లాస్ట్‌లో పాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్‌లో భారత్ టాప్ ప్లేస్‌కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో రెండో స్థానంలో, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఇక కివీస్, భారత్ చేతిలో ఓడిన పాక్ 0 పాయింట్ల(NRR -1.087)తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లీగ్ దశ ముగిసేలోపు టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ వెళ్తాయి.

Similar News

News February 24, 2025

తిరుమల భక్తులకు అలర్ట్

image

తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనుంది.
వెబ్‌సైట్: <>ttdevasthanams.ap.gov.in<<>>

News February 24, 2025

ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

image

TG: SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి HYDకు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.

News February 24, 2025

ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య

image

TGలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఆరు జిల్లాల్లోని 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏఐ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల్లో లోపాలను గుర్తించనున్నారు. దీంతో వారికి టీచర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

error: Content is protected !!