News October 18, 2024
భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

న్యూజిలాండ్తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.
Similar News
News December 7, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 7, 2025
తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News December 7, 2025
ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్పై ఛార్జిషీట్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.


