News April 21, 2024
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ ఆడాలి: అఫ్రీదీ

భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడితే బాగుంటుందన్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ అఫ్రీదీ స్పందించారు. ‘రెండు దేశాల మధ్య సిరీస్ గురించి రోహిత్ చాలా మంచి అభిప్రాయం చెప్పారు. ఈ దేశాల విషయంలో క్రికెట్‌ది కీలక పాత్ర. మ్యాచులు జరిగితే బంధం మెరుగవుతుంది. చక్కటి బంధం మన హక్కు’ అని స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య చివరిగా టెస్టు సిరీస్ 16ఏళ్ల క్రితం జరిగింది.
Similar News
News April 4, 2026
RECORD: బస్తా నిమ్మ ధర రూ.10,000

AP: ఎండలు మండుతున్న నేపథ్యంలో నిమ్మకాయలకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఏర్పడింది. నెల్లూరు(D) పొదలకూరు మార్కెట్‌లో బస్తా(80KGలు) ధర రికార్డు స్థాయిలో రూ.10,000 పలికింది. జనవరిలో KG రూ.8-10 ఉండగా ఇప్పుడు రూ.125కు చేరింది. పదేళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని లెమన్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అట్ల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. నాణ్యతను బట్టి బస్తా రేటు మరో రూ.2,000-3,000 పెరిగే అవకాశం ఉందన్నారు.
News April 4, 2026
రూ.1.10కోట్ల విలువైన 3,769 సిలిండర్లు సీజ్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 3 వరకు 3,699 డొమెస్టిక్ LPG, 70 చిన్న సిలిండర్లను సీజ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ రూ.1.10కోట్లుగా పేర్కొంది. 6A కేసులు 1,275 నమోదయ్యాయని, 216 FIRలు నమోదు చేసినట్లు వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో గ్యాస్ కొరత నేపథ్యంలో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే.
News April 4, 2026
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. 6 రోజులే ఛాన్స్

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్‌లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250
వివరాలు, దరఖాస్తు సైట్: <


