News November 29, 2024
భారత్-పాక్ ఢీ! ఎప్పుడంటే..

దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో రేపు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. మహ్మద్ అమన్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్ వేలంలో ప్రముఖంగా వినిపించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నారు. అండర్-19 ఆసియా కప్‌లో దాయాదులు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి.
Similar News
News February 19, 2026
మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News February 19, 2026
మహిళల్లో మైగ్రేన్‌కి ఎన్నో కారణాలు

మైగ్రెయిన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రెయిన్ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్ అయింది. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. 5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు అగ్రనేతలు లొంగుబాటుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్(మార్చి 31)కు ఇంకా 40 రోజులే మిగిలి ఉంది.


