News September 15, 2025
భారత్-పాక్ మ్యాచ్.. ICCకి PCB ఫిర్యాదు

భారత్, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.
Similar News
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News September 15, 2025
రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.
News September 15, 2025
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.