News June 20, 2024
IT స్టార్టప్‌లలో భారత్‌కు ఆరో స్థానం

భారత్‌లోని 3,600 IT స్టార్టప్‌ల ద్వారా గత ఏడాది $850M ఆదాయం వచ్చినట్లు నాస్కామ్ వెల్లడించింది. వాటిలో గత ఏడాదే 480 సంస్థలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రంగంలో IND ఆరో స్థానంలో ఉందని, త్వరలో థర్డ్ ప్లేస్‌కు చేరుకుంటుందని పేర్కొంది. 2014-22 మధ్య AI బేస్డ్ స్టార్టప్‌లు 62% పెరిగాయంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్, రోబోటిక్స్ కేటగిరీల్లో భారీగా స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది.
Similar News
News February 2, 2026
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.
News February 2, 2026
ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం
News February 2, 2026
WPL: ఢిల్లీ కల సాకారమయ్యేనా!

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతోంది. వరుసగా నాలుగు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన జట్టుగా DC నిలిచింది. గత మూడు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. రేపు గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తే వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన జట్టుగానూ నిలవనుంది. ఫైనల్లో ఆర్సీబీపై గెలిస్తే తొలి సారి విజేతగా నిలవాలనే కల సాకారం కానుంది.


