News September 20, 2025
H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన H1B వీసా నిబంధనపై భారత్ తొలిసారి అధికారికంగా స్పందించింది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది ఇరుదేశాల్లోని సంస్థలను ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. H1B నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు.
Similar News
News September 20, 2025
24 లేదా 25 తేదీల్లో మెగా DSC నియామక పత్రాల ప్రదానం

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
News September 20, 2025
రేపు OG ప్రీ రిలీజ్ ఈవెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ కాంబోలో సుజీత్ తెరకెక్కించిన OG మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని LB స్టేడియంలో రేపు 4PM నుంచి 10.30 PM వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సమయంలో రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR స్టాట్యూ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
News September 20, 2025
స్థానిక ఎన్నికలపై CM కీలక భేటీ

TG: స్థానిక ఎన్నికలు SEP30లోపు పూర్తవాలన్న HC తీర్పును ప్రభుత్వం వచ్చేవారం అప్పీల్ చేయనుంది. కొందరు మంత్రులు, న్యాయ నిపుణులతో CM దీనిపై ఇవాళ చర్చించారని సచివాలయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. BC రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్, వానలు, పండగల సెలవులు తదితరాలు ఆలస్యానికి కారణాలుగా HCకి తెలపాలని నిర్ణయించారట. కాగా, ఇది ఇప్పుడే బయటకు చెప్పొద్దని భేటీలో రేవంత్ హెచ్చరించారు.