News June 29, 2024

10 ఓవర్లకు భారత్ స్కోర్ 75/3

image

T20WC ఫైనల్‌లో భారత్ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 75 రన్స్ చేసింది. కోహ్లీ 36, అక్షర్ 26 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ 9, పంత్ 0, సూర్య 3 రన్స్‌కు ఔటయ్యారు. కేశవ్ మహరాజ్ 2, రబడ ఒక వికెట్ తీశారు.

Similar News

News October 23, 2025

220 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

image

జల్గావ్ DCC బ్యాంకులో 220 క్లర్క్(సపోర్ట్ స్టాఫ్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ పాసైన వారు అర్హులు. 21-35 ఏళ్ల వయసు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. అప్లికేషన్ ఫీజు రూ.1,000. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://jdccbank.com/

News October 23, 2025

పరాక్రమమే కాదు.. దయ కూడా ఉండాలి!

image

పాతాళ లోకాన్ని పాలించే బలి చక్రవర్తి కీర్తి ఓనాడు రావణుడి వద్దకు చేరింది. దీంతో బలిని సవాలు చేయడానికి పాతాళానికి వెళ్లాడు. కానీ రాజ భవనంలో రావణుడికి పరాభావం ఎదురైంది. పిల్లలే ఆయనను బంధించి, ఎగతాళి చేశారు. అది చూసిన బలి చక్రవర్తి, రావణుడిపై జాలిపడి, క్షమించి వదిలిపెట్టాడు. అహంకారంతో వచ్చిన రావణుడు పోరాడకుండానే వెనుతిరిగాడు. పరాక్రమంతో పాటు దయ కలిగి ఉండటమే నిజమైన రాజ లక్షణమని బలి నిరూపించాడు.

News October 23, 2025

ఎక్కువ సేపు షార్ట్స్ చూడకుండా యూట్యూబ్ నియంత్రిస్తుంది!

image

చాలా మంది రోజంతా రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ ఎక్కువ సమయాన్ని వృథా చేస్తుంటారు. దీనిని నియంత్రించుకునేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు రోజుకు ఎంత సమయం షార్ట్స్ చూడాలో సెట్టింగ్స్‌లో ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ సెట్ చేసుకోవచ్చు. నిర్ణయించుకున్న సమయం పూర్తవగానే షార్ట్స్ ఫీడ్ ఆగిపోయి నోటిఫికేషన్ వస్తుంది. డిజిటల్ వెల్‌బీయింగ్‌కు తోడ్పడేలా యూట్యూబ్ ఈ ఫీచర్‌ను తెచ్చింది.