News July 6, 2024

భారత్ అమ్ములపొదిలోకి 35వేల అసాల్ట్ రైఫిల్స్

image

ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలోకి ఆధునిక AK-203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి. భారత్-రష్యా జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది. తొలి విడత కింద 35వేల రైఫిల్స్ అందుబాటులోకి వచ్చాయి. INSAS, AK-47 రైఫిళ్లను ఇవి భర్తీ చేయనున్నాయి. రష్యా సహకారంతో యూపీలోనే వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News March 7, 2026

నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

image

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్‌ మలుపు తిరిగాయి.

News March 7, 2026

US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

image

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.

News March 7, 2026

వార్ ఎఫెక్ట్.. రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

image

ముడి చమురు ధర దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90 డాలర్లకు పెరిగింది. 2024 APR తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్‌ హైక్ చివరగా 2020 ఏప్రిల్‌లో నమోదైంది. ఇరాన్‌తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్‌లో తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి.