News March 29, 2025

‘జలియన్‌వాలా బాగ్’పై భారత్‌కు క్షమాపణలు చెప్పాలి: UK ఎంపీ

image

జలియన్‌వాలా బాగ్ ఘటనపై UK సర్కారు భారత్‌కు క్షమాపణలు చెప్పాలని ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ డిమాండ్ చేశారు. ‘2019లో అప్పటి పీఎం థెరెసా ఆరోజును గుర్తించారు కానీ క్షమాపణలు చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13, 1919న జలియన్‌వాలా బాగ్‌లో ఈస్టిండియా సర్కారు ఘోర మారణకాండకు పాల్పడింది. వేలాదిమంది అమాయక పౌరుల్ని మైదానంలోనే కాల్చి చంపించింది.

Similar News

News September 14, 2025

రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

image

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News September 14, 2025

రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.

News September 14, 2025

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

image

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.