News September 27, 2024

భద్రతామండలిలో భారత్ కచ్చితంగా ఉండాలి: ఫ్రాన్స్

image

భద్రతామండలి(UNSC)లో భారత్‌ను చేర్చాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే. అదే విధంగా ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి. పలు నిబంధనల్నీ మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రోన్ స్పష్టం చేశారు.

Similar News

News September 27, 2024

ఆ రాష్ట్రంలో ఉన్నవి రెండే జిల్లాలు!

image

రాష్ట్రం అంటే చాలా జిల్లాలుంటాయి. కానీ దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన గోవాలో కేవలం రెండే జిల్లాలున్నాయి. భారత్‌కు 1947లోనే స్వాతంత్ర్యం లభించినా, గోవాకు పోర్చుగీసు నుంచి 1961లో ఫ్రీడమ్ దక్కింది. అనంతరం 26 ఏళ్లకి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పర్యాటకమే ఈ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. అన్నట్టు.. ఇక్కడ 1962కి ముందు పుట్టిన వారు పోర్చుగీసు పౌరసత్వానికి అర్హులు.

News September 27, 2024

జూ.ఎన్టీఆర్ ‘దేవర’ పబ్లిక్ టాక్

image

Jr.NTR, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ ప్రీమియర్లు పడ్డాయి. సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్‌తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ థ్రిల్లింగ్ ట్విస్ట్, అనిరుధ్ BGM అదిరిపోయాయని చెబుతున్నారు. VFX ఇంకా బాగుండాల్సిందని, జాన్వీని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News September 27, 2024

మళ్లీ రామాయణంలో ప్రభాస్..?

image

ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి రామాయణంలో నటించనున్నారని బీటౌన్ వర్గాలంటున్నాయి. ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్‌లో రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పరశురాముడి రోల్‌లో ప్రభాస్‌ నటించనున్నారని సమాచారం. ఆ మూవీలో ప్రధాన పాత్రల గురించి పలు ప్రచారాలు నడుస్తుండగా, అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.