News March 8, 2025
CT ఫైనల్‌లో భారత్ టాస్ గెలవకూడదు: అశ్విన్

రేపు న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ‘భారత్ వరసగా 11 మ్యాచుల్లో టాస్ ఓడింది. అయినప్పటికీ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బాగా ఆడుతోంది. రేపు కూడా టాస్ ఓడి న్యూజిలాండ్‌ను ఏది కావాలంటే అది తీసుకోనివ్వాలి. మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు 54శాతం ఛాన్స్ ఉందని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
గ్రీన్‌లాండ్‌లో పెంగ్విన్‌లా? ట్రంప్‌పై నెటిజన్ల ట్రోలింగ్

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ పెంగ్విన్‌తో ఉన్న AI ఫొటోను వైట్‌హౌస్ Xలో షేర్ చేసింది. అయితే గ్రీన్‌లాండ్ ఉండే ఉత్తరార్ధ గోళంలో పెంగ్విన్లు అసలు ఉండవని, అవి కేవలం అంటార్కిటికా వంటి దక్షిణార్ధ గోళంలోనే ఉంటాయంటూ నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన భేటీలో యూరప్ దేశాలపై టారిఫ్ మినహాయింపులు ఇస్తూ గ్రీన్‌లాండ్‌పై ఒప్పందానికి ట్రంప్ మొగ్గు చూపారు.
News January 24, 2026
ESIC నోయిడాలో ఉద్యోగాలు

<
News January 24, 2026
సూర్యుడు మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాడు?

సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తాం. అందుకే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అంటాం. అంటే ఆరోగ్యం సూర్యుని వల్ల కలుగుతుందని అర్థం. సూర్యకిరణాల వల్ల శరీరంలో విటమిన్ D తయారవుతుంది. ఇది ఎముకల పుష్టికి చాలా అవసరం. సూర్యోపాసనతో ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్ర, హృదయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రాచీన కాలం నుంచి ఉన్న సంధ్యావందనం, సూర్య నమస్కారాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని పొందడమే!


