News August 16, 2025

ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ ఆడొద్దు: హర్భజన్

image

ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచును భారత్ బాయ్‌కాట్ చేయాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ‘క్రికెట్ కంటే దేశం కోసం సైనికులు చేసే త్యాగం గొప్పది. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేదేం లేదు. ఇది చాలా చిన్న విషయం. అన్నింటికంటే దేశమే ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడితే సైనికుల త్యాగాలను ఎగతాళి చేసినట్లవుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ SEP 5న UAE వేదికగా ప్రారంభం కానుంది. IND, PAK 14న తలపడనున్నాయి.

Similar News

News August 16, 2025

అటకెక్కిన ‘దేవర-2’!

image

NTR, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’కు కొనసాగింపుగా తీసే పార్ట్-2 అటకెక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ తీసేందుకు NTR కమిట్ అయ్యారని, దీంతో దేవర-2 పట్టాలెక్కడం కష్టమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూవీ రద్దు విషయమై హీరో, దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరిగాయట. మరోవైపు నాగచైతన్యతో కొరటాల కొత్త స్క్రిప్ట్‌తో మూవీ తెరకెక్కిస్తారని సమాచారం.

News August 16, 2025

రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

image

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.

News August 16, 2025

‘OG’లో కన్మని ఎవరంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమాలో నటిస్తోన్న ప్రియాంకా మోహన్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.