News December 18, 2024
కిమ్ రాజ్యంలో డిప్లమాటిక్ ఆపరేషన్స్‌కు భారత్ సై

ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను భారత్ మళ్లీ పూర్తిస్థాయికి తీసుకెళ్తోంది. కొవిడ్ టైమ్‌లో మూసేసిన ఎంబసీని మళ్లీ తెరిచింది. అధికారులను అక్కడికి పంపించింది. కిమ్‌తో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే ముందుగా ఆఫీస్ మొత్తాన్ని జల్లెడ పట్టనుంది. నిఘాకు తావులేకుండా ఏర్పాట్లు చేయనుంది. మిసైళ్లు, న్యూక్లియర్ టెక్నాలజీలో కిమ్ రాజ్యం వృద్ధి సాధిస్తోంది. దీనిని పాక్‌కు చేరకుండా పావులు కదపడమే భారత్ టార్గెటని సమాచారం.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

ఒక మెన్స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.


