News April 16, 2024
బంగ్లా సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది.
★ టీమ్: హర్మన్‌ప్రీత్ (C), మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు
Similar News
News January 29, 2026
ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల

TG: ఇంటర్ పరీక్షలకు సంబంధించి సైన్స్, ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను బోర్డు రిలీజ్ చేసింది. కాలేజ్ లాగిన్ ఐడీల్లో వాటిని పొందుపరిచినట్లు తెలిపింది. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌ను కలవాలని సూచించింది. హాల్ టికెట్స్‌లోని వివరాలను పరిశీలించి కాలేజ్, బోర్డు సూచనలు పాటించాలని కోరింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
News January 29, 2026
173 ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 29, 2026
గర్భ నిరోధక ఇంజెక్షన్

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దీన్ని డీఎంపీఏ ఇంజెక్షన్ (డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్) వాడతారు. ఇందులో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. ఆ తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు.


