News March 30, 2024
ఏప్రిల్‌లో టీ20 WCకు భారత జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును BCCI ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. WC కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ICC గడువిచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు BCCI సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా IPL స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 9, 2026
పాలిసెట్.. మరికొన్ని గంటలే ఛాన్స్

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే <<19588593>>పాలిసెట్<<>> దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని విద్యార్థులు ఈ రాత్రిలోగా చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ పాసైనవారు, ఇటీవల పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <
News April 9, 2026
IPL: నేడు LSGvsKKR.. గెలిచేదెవరు?

ఈరోజు కోల్‌కతా వేదికగా LSG, KKR 7.30PMకి తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు LSG రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచింది. అటు బౌలింగ్‌లో తడబడుతున్న KKR ఇంకా బోణీ కొట్టలేదు. 3 మ్యాచుల్లో 2 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గత మ్యాచుకు దూరమైన నరైన్ ఈరోజు ఆడే అవకాశముంది. గాయపడ్డ వరుణ్ ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని CricBuzz పేర్కొంది.
News April 9, 2026
కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>


