News September 19, 2025

మూడు వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత 5 పరుగులు చేసి శుభమ‌న్ గిల్ పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత 8వ ఓవర్లో అభిషేక్ శర్మ(38), హార్దిక్(1) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అక్షర్(7), శాంసన్(28) ఉన్నారు. భారత్ స్కోర్ 84/3గా ఉంది.

Similar News

News September 20, 2025

రాష్ట్రంలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆస్పత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాజనర్సింహ తెలిపారు.

News September 20, 2025

RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

image

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. ఎంపికైన వారికి అక్టోబర్ మూడో వారంలో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT2) నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించనుంది.

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.