News September 30, 2025
మళ్లీ పాక్‌తో తలపడనున్న భారత్

మెన్స్ ఆసియాకప్‌లో పాక్‌ను భారత్ మూడుసార్లు చిత్తుచేసిన విషయం తెలిసిందే. ఇక మహిళల జట్టు వంతు వచ్చింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో నేడు SLను ఢీకొట్టనున్న భారత్, OCT 5న కొలంబోలో PAKతో తలపడనుంది. అలాగే విశాఖలో 9న SAతో, 12న AUSతో ఆడనుంది. ఇండోర్‌లో 19న ENGతో, నవీముంబైలో 23న NZతో, 26న BANను ఢీకొంటుంది. ఇక 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2 ఫైనల్ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు కాలేదు.
Similar News
News January 26, 2026
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్!

గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో WC వార్మప్ మ్యాచుకు జట్టులో చేరుతారని వెల్లడించాయి. కాగా వరల్డ్‌కప్ ముందు తిలక్ ఫిట్‌నెస్ సాధించడంతో భారత్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఆయన చేరికతో జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.
News January 26, 2026
కార్లపై భారీగా టారిఫ్‌లను తగ్గించనున్న భారత్

భారత్, EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో భాగంగా యూరోపియన్ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తొలుత 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై పన్ను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఈ టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.
News January 26, 2026
భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: జిన్‌పింగ్

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనా మంచి స్నేహితులు, భాగస్వాములు అని పేర్కొన్నారు. కాగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత 4 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన BRICS సదస్సుతో పాటు పలు ద్వైపాక్షిక సమావేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి.


