News June 3, 2024

India Today అంచనాలు తప్పుతాయి: మాజీ ఐఏఎస్

image

AP అసెంబ్లీ ఎన్నికలపై India Today Axis My India అంచనాలు తప్పుతాయని మాజీ ఐఏఎస్ అధికారి PVS శర్మ తెలిపారు. ‘పోలింగ్‌ రోజున సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటర్ల అభిప్రాయాలను సేకరించడంలో Axis My India విఫలమైంది. సీఎం జగన్ వ్యూహం ప్రకారం ఆ ఓట్లు వైసీపీకే అనుకూలం. ఈ సంస్థ పార్లమెంట్ నియోజకవర్గానికి 250-300 శాంపిల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇదో అనైతిక సర్వే’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 11, 2024

నేటి నుంచి రంజీ ట్రోఫీ

image

దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.

News October 11, 2024

రతన్ టాటాపై పేటీఎం సీఈవో ట్వీట్.. నెటిజన్ల విమర్శలు

image

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.

News October 11, 2024

రతన్ టాటా బయోపిక్.. ఓ అవసరం!

image

ప్రజల కోసం పరితపించిన సమాజ సేవకుడిగా, నిత్య కృషీవలుడిగా రతన్ టాటా కీర్తి భూమిపై అజరామరం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మహనీయుడి జీవితం ముందు తరాలకూ గుర్తుండేలా ఆయనపై ఓ బయోపిక్ తీయాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. లక్షల జీవితాల్లో వెలుగులు నింపిన ‘రత్నం’లాంటి ఆ మనిషి కృషి ఎన్ని తరాలైనా మరచిపోని రీతిలో తెరకెక్కాలంటూ అభిమానులు కోరుతున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ తీసుకుంటుందేమో చూడాలి.