News April 16, 2025
AI టాలెంట్‌లో భారత్ టాప్: స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ

గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్‌లో నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్‌ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.
Similar News
News January 24, 2026
తూ.గో: జిల్లాలో 201 కేసుల్లో 12,570 కేజీల గంజాయి స్వాధీనం

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేయాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 201 కేసులలో 12,570 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మాదకద్రవ్య దుర్వినియోగ హాట్‌స్పాట్‌లు గుర్తించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సున్నిత ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఎస్పీ సూచించారు.
News January 24, 2026
వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎలా ఉండాలంటే?

బాత్రూం విషయంలో అశ్రద్ధ తగదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పగిలిన అద్దాలు, వాడని వస్తువులు, విడిచిన బట్టలు ఉంచొద్దని అంటున్నారు. ‘దీనివల్ల ప్రతికూల శక్తి పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. బాత్రూం విశాలంగా ఉండాలి. బకెట్లను నీళ్లతో నింపి ఉంచడం మంచిది. వాటర్ లీకేజీ వల్ల సమస్యలొస్తాయి. శరీరాన్ని శుద్ధి చేసే ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 24, 2026
ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్

RBI, నాబార్డు, PSGICల్లోని ఉద్యోగులు, రిటైరైన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన, పెన్షన్ సవరణకు ఆమోదం తెలిపింది. దీని కోసం ₹13500Cr వెచ్చించనుంది. PSGICల్లో వేతనం 12.41%, పెన్షన్ 30% పెరుగుతుంది. నాబార్డులో జీతం 20% మేర, RBI, నాబార్డులలో పెన్షన్ 10% హైక్ అవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా 93,157 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు 2022 AUG, NOV నుంచి వర్తిస్తుంది.


