News July 26, 2024
నేడు బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ

మహిళల ఆసియా కప్‌లో భారత్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అజేయంగా నాకౌట్‌కు చేరిన భారత్ ఇప్పుడు ఫెవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరో సెమీస్‌లో పాకిస్థాన్ ఆతిథ్య జట్టు శ్రీలంకతో తలపడనుంది. కాగా గ్రూప్ స్టేజ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను, 78 రన్స్ ఆధిక్యంతో UAEను, 82 రన్స్ తేడాతో నేపాల్‌ను భారత్ చిత్తుచేసింది. కాగా మధ్యాహ్నం గం.2కు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News November 22, 2025
వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.
News November 22, 2025
ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


