News June 27, 2024
భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్ టాస్ ఆలస్యం

T20 WCలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ టాస్ ఆలస్యంగా వేయనున్నారు. వర్షం తగ్గినప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గ్రౌండ్‌ను పరిశీలించి టాస్, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ప్రకటించనున్నారు.
Similar News
News January 7, 2026
టమాటా దిగుబడి ఎక్కువైతే అక్కడి రైతులు ఏం చేస్తారంటే?

మన దగ్గర టమాటా దిగుబడి ఎక్కువై, సరైన గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆగ్రహంతో, బాధతో పంటను రోడ్ల పక్కన పడేయడం చూస్తుంటాం. ఇటలీ, చైనా వంటి దేశాల్లో మాత్రం టమాటాలకు ధర లేకుంటే వాటిని నీటితో శుభ్రపరిచి, రెండుగా కోసి ఎండ తీవ్రంగా ఉన్నచోట ఆరబెడతారు. అవి రుచి కోల్పోకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఆ ముక్కలపై ఉప్పు చల్లుతారు. అవి బాగా ఎండిపోయాక, ప్యాకింగ్ చేసి మార్కెట్లలో అమ్మి ఆదాయాన్ని పొందుతారు.
News January 7, 2026
మెుక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి సహజ కషాయం

మొక్కజొన్న పంటను ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుల నిర్మూలనకు సహజ కషాయాన్ని రూపొందించారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివకృష్ణ. 200 లీటర్ల నీటిలో కిలో సర్ప్, అర కిలో పసుపును వేసి బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్‌కు రంద్రం చేసి మొక్కజొన్న మొక్క మొవ్వులో ఈ ద్రావణం వేయాలి. 25 రోజుల వయసున్న పైరులో మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
News January 7, 2026
T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్‌తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు ఆడేందుకు ఇండియా రానుంది.


