News June 12, 2024

ఇండియాVSమినీ ఇండియా.. ఎమోషనల్ మ్యాచ్: బాలాజీ

image

ఇవాళ జరిగే మ్యాచ్ ఓ రకంగా భావోద్వేగంతో కూడుకున్నదేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అన్నారు. USA-టీమ్ ఇండియా మ్యాచును ఇండియా vs మినీ ఇండియాగా వర్ణించారు. అమెరికా జట్టులో భారత సంతతి క్రికెటర్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కాగా భారత్‌తో మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేస్తే USA ఆటగాళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతాయని బాలాజీ చెప్పారు. అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News December 23, 2024

విష్ణుతో ప్రాణహాని.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు!

image

TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్‌పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

News December 23, 2024

ఈ నెల 30న క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

News December 23, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.