News January 27, 2025
UAE లేదా బంగ్లాతో భారత్ వామప్ మ్యాచ్?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమ్ ఇండియా ఓ వామప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లేదా యూఏఈలో ఏదో ఒకదానితో ఈ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 9న మెగా ఈవెంట్ ఫైనల్ జరగనుంది.
Similar News
News March 14, 2025
మీరు గొప్పవారు సర్..

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.
News March 14, 2025
SRH కెప్టెన్‌ను మార్చితే..!

IPL-2025లో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటికి భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఒక్క SRHకు మాత్రమే ఫారిన్ ప్లేయర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీంతో SRHకు కూడా స్వదేశీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టులో తెలుగు ప్లేయర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.