News October 23, 2024

ఇండియా వెనక్కి తగ్గదు, ఓటమిని ఒప్పుకోదు: బ్రెట్‌ లీ

image

క్రికెట్‌లో టీమ్ ఇండియా శక్తిమంతమైనదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డారు. ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గే అలవాటు ఆ జట్టుకు లేదన్నారు. ‘భారత్ ఒకప్పటి లాంటి జట్టు కాదు. ఎప్పుడైనా, ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగలమని భారత్‌కు తెలుసు. AUSను ఓడించగలమని కూడా తెలుసు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల ఓడింది. రెండో టెస్టులో కచ్చితంగా పుంజుకుంటుంది’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2024

చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి

image

HYDలో చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది. వాల్టా చట్టం అమలుపై GHMC, అటవీ శాఖ అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమీక్షించారు. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్లు కాలనీల్లో కూలే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని ఆదేశించారు.

News October 24, 2024

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100kms వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

News October 23, 2024

పుణేలో కోహ్లీ సగటు 133.50.. రేపు కూడా రిపీట్ చేస్తారా?

image

మహారాష్ట్రలోని పుణే MCA స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 267 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 254*గా ఉంది. యావరేజ్ 133.50 కావడం విశేషం. మరి రేపు NZతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ ఎలా విజృంభిస్తారో చూడాలి.