News April 29, 2024
భారత్ ఎవ్వరికీ తలవంచదు: రాజ్నాథ్ సింగ్

చైనాతో చర్చలపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే భారత్ ఎవ్వరికీ తలవంచదని ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్ను దాటాయని.. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Similar News
News December 7, 2025
అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు: ACA అధ్యక్షుడు చిన్ని

AP: రాష్ట్రంలో శాప్తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని క్రీడలను ప్రోత్సహిస్తామని MP, ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించేందుకు CM CBN కృషి చేస్తున్నారని తెలిపారు. కిదాంబి శ్రీకాంత్తో కలిసి 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో, పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కాగా ఈ పోటీలు విజయవాడలో ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.
News December 7, 2025
764 ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్లో 764 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B 561, టెక్నీషియన్-A 203 పోస్టులున్నాయి. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ https://www.drdo.gov.in/లో అందుబాటులో ఉంటుంది.
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.


