News September 13, 2024
బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్

బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.
Similar News
News October 21, 2025
6 లక్షల వర్కర్ల స్థానంలో రోబోలు.. అమెజాన్ ప్లాన్!

ఆటోమేషన్ దిశగా అమెజాన్ అడుగులేస్తోంది. 2033 నాటికి అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో ఆ సంస్థ భర్తీ చేయనున్నట్లు The New York Times నివేదిక వెల్లడించింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలలో 75% ఆటోమేట్ చేసే దిశగా రోబోటిక్ టీమ్ పని చేస్తోందని చెప్పింది. 2027 నాటికి భర్తీ చేయాల్సిన 1.6 లక్షల జాబ్స్‌నూ కట్ చేయొచ్చని అంచనా వేసింది. ఆటోమేషన్తో 2025-2027 మధ్య $12.6B ఆదా అవుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.
News October 21, 2025
త్వరలో 6వేల పోలీసు ఉద్యోగాలకు పోస్టింగ్స్: మంత్రి

AP: పోలీసు అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తమ ప్రభుత్వం 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, వారికి త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో నియామకాలు జరగలేదని విమర్శించారు. మరోవైపు పోలీసు శాఖలో 11వేల ఖాళీలు ఉన్నాయని ఇదివరకే డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
News October 21, 2025
Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.