News March 10, 2025

INDIA WIN.. బండి సంజయ్ రియాక్షన్

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమ్ఇండియా..అన్ స్టాపబుల్, అన్ బీటబుల్, అన్ ఫర్గెటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ది మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 10, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, తదితరులు ఉన్నారు.

News March 10, 2025

ఏలూరు: ఆర్జీల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ తెలిపారు. 40 రోజుల ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తిరిగి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అనేక ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుదారులు అందించారు. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ చేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News March 10, 2025

సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

image

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!