News October 2, 2025

AACలో 13 మెడల్స్ సాధించిన భారత్

image

అహ్మదాబాద్‌: 11వ ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌(AAC)లో భారత్ 13 మెడల్స్ సాధించింది. ఇప్పటివరకు స్విమ్మింగ్, డైవింగ్ పోటీల్లో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇవాళ చివరిరోజు మెన్స్ రిలే టీమ్‌తో పాటు భవ్య, సాజన్, శ్రీహరి 4 బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. మొత్తంగా 4 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్‌తో IND 9వ స్థానంలో నిలిచింది. చైనా(49) టాప్‌లో ఉంది. 4న ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో ఈవెంట్స్ జరగనున్నాయి.

Similar News

News February 17, 2026

నటి ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

image

నటి ప్రత్యూష మృతి <<19162866>>కేసులో<<>> సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. పోస్టుమార్టం అన్‌ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News February 17, 2026

బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

image

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

News February 17, 2026

ధురంధర్ మేకర్స్‌కు షాక్.. బ్లాక్‌లిస్ట్‌లో ప్రొడక్షన్ హౌస్?

image

ధురంధర్ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ ఫిల్మ్ మేకర్స్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసేందుకు ముంబై కార్పొరేషన్(BMC) సిద్ధమైంది. అనుమతులు లేకుండా భవనాలపై షూటింగ్‌లు చేసి వరుస ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌లిస్ట్ అయితే భవిష్యత్తులో ముంబైలో షూటింగ్‌ చేపట్టేందుకు నిర్మాణ సంస్థకు అనుమతులు లభించవు.