News March 28, 2025

భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

image

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్‌ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.

Similar News

News March 31, 2025

మెషిన్ కాఫీ తాగుతున్నారా?

image

రోజూ మెషిన్ కాఫీ తాగితే ఆరోగ్యానికి అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫీన్ బూస్ట్‌తో ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. మెషిన్ కాఫీలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కేఫ్ స్టోల్, కహ్వియోల్, డైటర్పీన్స్ గుండెపై ప్రభావం చూపుతాయి. ఇవి ఫిల్టర్ చేయవు కాబట్టి కొలెస్ట్రాల్ పదార్థాలు అలాగే ఉండిపోతాయి. రోజూ 3 కప్పులకంటే ఎక్కువగా తాగేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

News March 31, 2025

నేహా కక్కర్ కన్సర్ట్.. నిర్వాహకులకు రూ.4.52 కోట్ల నష్టం

image

బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ వల్ల తమకు రూ.4.52 కోట్ల ($5,29,000) నష్టం వచ్చినట్లు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె షో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌కు నేహా 3 గంటలు ఆలస్యంగా వెళ్లారు. దీంతో తనకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని ఆమె ఆరోపించారు.

News March 31, 2025

నేడు 38 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!