News August 10, 2024
భారత్ మరో కాంస్యం.. మోదీ, రాహుల్ అభినందనలు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం గెలుచుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది రెజ్లర్లకు మరింత గర్వకారణమని చెప్పారు. అమన్‌కు అభినందనలు తెలియజేశారు. అతని ఆటలో అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ మరుపురాని ఫీట్‌ను దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌కు మరో పతకం రావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
Similar News
News October 31, 2025
AP న్యూస్ రౌండప్

➤ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి రూ.150కోట్లు విడుదల చేసిన కేంద్రం
➤ SC, ST అట్రాసిటీ బాధితులకు రాయితీపై రుణాలు: మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్
➤ NOV 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్.. అక్కడ జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2025లో పాల్గొననున్న మంత్రి
➤ రాష్ట్ర వ్యాప్తంగా 1,592 స్కూళ్లలో బాలికలకు కరాటేలో శిక్షణ.. 2025-26 అకడమిక్ ఇయర్లో 2 నెలల పాటు 20 తరగతుల నిర్వహణ
News October 31, 2025
మూల విరాట్టుకు ఆ శక్తి ఎక్కడిదంటే?

ఆలయాల్లో మూల విరాట్టు కింద రాగి రేకుపై యంత్రాలు, బీజాక్షరాలను ప్రతిష్ఠిస్తారు. రాగి మంచి విద్యుత్ వాహకం కావడంతో.. ఆ రేకుపై ఉన్న గీతలు, బీజాక్షరాల మధ్య శక్తి కేంద్రీకృతమవుతుంది. మంత్రాలతో కలిపి ప్రతిష్ఠించడం వల్ల చుట్టూ ఉన్న శక్తి కూడా ఆ కేంద్రంలోకి ఆకర్షితమవుతుంది. ఇలా ఏర్పడిన శక్తి క్షేత్రంలోకి మనం ప్రవేశించినప్పుడు, మన శరీరం దాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మానసిక బలం, ధైర్యం లభిస్తాయి.
News October 31, 2025
7,565 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

SSCలో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల 18-25ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, SC, ST, మాజీ సైనికులకు ఫీజు లేదు. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు.


