News March 5, 2025

భారత్ గెలుపు.. కాంగ్రెస్ నేత షామా ట్వీట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. ‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్‌ చేయడంతో పాటు ICC నాకౌట్ మ్యాచుల్లో వెయ్యి రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Similar News

News April 7, 2026

గెజిట్ నోటిఫికేషన్‌లో 2024 జూన్ 2 ఎందుకు?

image

AP: కేంద్రం 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆ సమయం ముగిశాక హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే క్యాపిటల్ అవుతుంది. ఏపీకి కొత్త రాజధాని రావాలి. అంటే 2024 జూన్ 2 నుంచి ఏపీకి కొత్త రాజధాని వచ్చిందన్నమాట.

News April 7, 2026

IPL వల్లే నా కెరీర్ ముగిసింది: పీటర్సన్

image

IPL పట్ల తనకున్న ఆసక్తే తన అంతర్జాతీయ కెరీర్ ముగియడానికి కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆరోపించారు. IPL ఆడేందుకు అనుమతించని ECB తనను మీడియా ద్వారా వేధించిందని పేర్కొన్నారు. దీనివల్ల 150 టెస్టులు ఆడాల్సిన తాను 104 మ్యాచ్‌లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోరాటం వల్లే నేటి తరం ఇంగ్లిష్ ఆటగాళ్లు IPL ద్వారా భారీగా సంపాదిస్తున్నారని గుర్తు చేశారు.

News April 7, 2026

ఎయిరిండియా CEO విల్సన్ రాజీనామా

image

ఎయిరిండియా CEO క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉన్నప్పటికీ ముందే తప్పుకొన్నారు. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త CEOను ఎంపిక చేసే వరకు ఆయన విధుల్లో కొనసాగుతారు. గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్ జూన్‌లో రావాల్సి ఉంది. మరోవైపు కంపెనీ నష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.