News July 7, 2024
టాస్ గెలిచిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

జింబాబ్వేతో రెండో టీ20లో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా సాయిసుదర్శన్ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు.
IND: గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్, సాయి సుదర్శన్, పరాగ్, రింకూ, జురెల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్
ZIM: మధెవెరె, ఇన్నోసెంట్, బెన్నెట్, రజా, మయర్స్, కాంప్‌బెల్, మదాండే, మసకద్జా, జోంగ్వే, బ్లెస్సింగ్, చటారా
Similar News
News November 30, 2025
NGKL: సర్పంచ్ నుంచి మంత్రి దాకా చర్లకోల ప్రస్థానం..!

తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల లక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గా మొదలైంది. ఆయన 1985లో ఆవంచ సర్పంచ్‌గా గెలుపొందారు. ఆ తర్వాత గ్రంథాలయ ఛైర్మన్‌గా పనిచేశారు. 2004 మరియు 2014లో జడ్చర్ల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో విద్యుత్, ఆరోగ్య శాఖల మంత్రిగా కూడా పనిచేసి, 2018లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
News November 30, 2025
సినిమా UPDATES

* త్రివిక్రమ్-వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
* రామ్ పోతినేని తన తదుపరి సినిమాను నూతన దర్శకుడు రామ్ కిశోర్‌తో చేస్తారని టాక్. 2026 జూన్‌కు షూటింగ్ కంప్లీట్ చేసి ఏడాది చివరికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
* ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
News November 30, 2025
విశ్వాన్ని శాసించే విష్ణుమూర్తిని ఎందుకు పూజించాలి?

సర్వః శర్వః శివస్థ్సాణుః భూతాదిర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||
సమస్త సృష్టికి మూలమైన, హింసను నశింపజేసే, శుభాన్ని కలిగించే దేవుడు విష్ణుమూర్తి. ఆయనే సమస్త భూతములకు ఆధారం. ఈ జగత్తును భరించే వ్యక్తి కూడా ఆయనే. అంతటి శక్తిమంతమైన దేవుడిని నిరంతరం స్మరిస్తే, మన జీవితంలో శుభం, స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


