News December 5, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఆస్ట్రేలియా ఉమెన్స్‌తో తొలి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
IND: ప్రియా పూనియా, స్మృతి, హర్లీన్ డియోల్, హర్మన్, రోడ్రిగ్స్, రిచా గోష్, దీప్తి శర్మ, టీటాస్ సాధు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, రేణుకా ఠాకూర్
AUS: లిచ్‌ఫీల్డ్, జార్జియా ఒల్, పెర్రీ, మూనీ, సుథర్లాండ్, గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, వార్హెమ్, అలనా కింగ్, కిమ్ గర్త్, మెగన్ స్కట్
Similar News
News December 9, 2025
ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈసారి సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. BRS, INC, BJP అభ్యర్థులకు దీటుగా రెబల్స్ బరిలోకి దిగడంతో గ్రామాల్లో ప్రచారం ఓ రేంజ్లో జరుగుతోంది. ఇవి ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని ఓటర్లు అంటున్నారు. ఎల్లుండే తొలి విడత పోలింగ్ జరగనుండటంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్ పోటీదారులు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.
News December 9, 2025
తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 9, 2025
తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్‌లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.


