News July 28, 2024
టాస్ గెలిచిన భారత్.. జట్లు ఇవే

శ్రీలంకతో జరగబోయే రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: యశస్వి, శాంసన్, సూర్య (C), పంత్ (WK), హార్దిక్, పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, సిరాజ్.
శ్రీలంక: నిస్సాంక, కుశాల్ మెండిస్ (WK), కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, అసలంక (C), షనక, హసరంగ, రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో. ** సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్ వీక్షించొచ్చు.
Similar News
News October 22, 2025
మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల హెచ్చరిక లేఖ విడుదలైంది. దీంతో ఆ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే చెడ్డపేరు వస్తుందని, ఇతర మావోయిస్టుల లొంగుబాట్లకు ఇబ్బంది వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
News October 22, 2025
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News October 22, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్ 26 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, STలకు రూ.944. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/