News February 7, 2025
శ్రేయస్ అయ్యర్ ఆటతో భారత్ గెలిచింది: జహీర్ ఖాన్

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను మాజీ పేసర్ జహీర్ ఖాన్ కొనియాడారు. ‘శ్రేయస్ ఆట చాలా చూడముచ్చటగా అనిపించింది. రెండు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరో వికెట్ పడి ఉంటే ఛేజింగ్ ఇబ్బంది అయ్యేదే. ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి బంతి ఎలా గింగిరాలు తిరిగిందో చూశాం. కానీ తన దూకుడైన ఆటతో అయ్యర్ ఛేదనను సులువు చేసేశారు’ అని ప్రశంసించారు.
Similar News
News March 26, 2026
తిరుమల కొండపై హోటళ్లు బంద్.. అన్నదాన సత్రంపై ఒత్తిడి

గ్యాస్ కొరత తిరుమల భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సిలిండర్లు దొరక్క కొండపై 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా TTD ఉచిత అన్నప్రసాదానికి క్యూ కడుతున్నారు. గత నెలతో పోలిస్తే అదనంగా లక్ష మంది అన్నప్రసాదం స్వీకరించారు. TTD నిత్యం 6 టన్నుల గ్యాస్‌ను వంట కోసం వాడుతోంది. ప్రస్తుతం IOCL నుంచి గ్యాస్ అందుతున్నా హోటళ్ల మూసివేత వల్ల అన్నదాన విభాగంపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది.
News March 26, 2026
పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.
News March 26, 2026
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.


