News April 30, 2024

‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు టాక్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Similar News

News March 12, 2026

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

image

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.

News March 12, 2026

ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

image

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

News March 12, 2026

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన బాలికల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 17 వరకు ధ్రువపత్రాలను పరిశీలించి సీటును కన్ఫామ్ చేస్తారు.