News July 7, 2024
హైదరాబాద్‌లో దిగిన ‘భారతీయుడు2’ టీమ్

‘భారతీయుడు2’ టీమ్ హైదరాబాద్‌లో ల్యాండయింది. Nకన్వెన్షన్ సెంటర్‌లో కాసేపట్లో ప్రారంభమయ్యే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేయనుంది. కమల్ హాసన్ లీడ్ రోల్‌లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, SJ సూర్య కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. దాదాపు రూ.350కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.
Similar News
News March 27, 2026
45 ఏళ్లకే ₹కోటితో రిటైర్‌మెంట్: ఏం చేయాలి?

30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 45 ఏళ్లకు రిటైర్ అవ్వడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేస్తూ 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించొచ్చు. ఇందులో ₹5,000 గోల్డ్‌లో, ₹9,500 MFలో పెట్టాలి. ఏటా పెట్టుబడిని 10% పెంచుతూ వెళ్తే కాంపౌండింగ్ పవర్‌తో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. గోల్డ్ ద్వారా సుమారు ₹20 లక్షలు, MF ద్వారా ₹82 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం
News March 27, 2026
ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.


