News November 16, 2024

ట్రంప్‌న‌కు త్వరలో భారతీయ అమెరిక‌న్ల కీల‌క ప్ర‌తిపాద‌న‌

image

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను అరికట్టేలా ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని భారతీయ అమెరికన్లు త్వరలో ట్రంప్‌ను కోరనున్నారు. ట్రంప్ ఇటీవల బంగ్లాలో హిందువులపై దాడులను ఖండించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాపై కఠిన చర్యలకు ట్రంప్ వెనుకాడబోరని ఫిజీషియన్ భరత్ బరాయ్ పేర్కొన్నారు. ఈ విషయమై బంగ్లా స్పందించకపోతే కాంగ్రెస్‌ను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 16, 2024

పన్నూ హత్యకు కుట్ర.. వికాస్‌పై కేసు పెట్టిన న్యాయాధికారిపై ట్రంప్ వేటు

image

ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర చేశారని వికాస్ యాదవ్‌పై కేసు న‌మోదు చేసిన ఫెడ‌ర‌ల్ ప్రాసిక్యూట‌ర్ Damian Williamsను ట్రంప్ తొల‌గించారు. అత‌ని స్థానంలో డిస్ట్రిక్ట్ అటార్నీగా SES మాజీ ఛైర్మ‌న్ జే క్లేట‌న్‌ను నామినేట్ చేశారు. పన్నూ హత్యకు భారత నిఘా విభాగం EX అధికారి వికాస్ కుట్ర చేశారని US న్యాయ శాఖ ఆరోపిస్తోంది. అయితే వికాస్‌తో ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది.

News November 16, 2024

స్టైలిష్ బామ్మ

image

జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా (లెజెండరీ గ్లామ్మా) అనే వృద్ధురాలు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఆమె తన మనవరాలు డయానా కౌంబాతో కలిసి స్టైలిష్ డ్రెస్సులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె స్టైలిష్ ఐకాన్‌గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తనను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చోలా చెప్పుకొచ్చారు. ఆమె ఎలా రెడీ అవుతారో మీరూ చూసేయండి.

News November 16, 2024

గుడ్ న్యూస్.. ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు

image

TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.