News July 27, 2024
పాక్ BATs దాడిని తిప్పికొట్టిన భారత ఆర్మీ

పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. JK కుప్వారాలోని మచ్చాల్ సెక్టార్లో LOC వద్ద ఎన్కౌంటర్లో ఒకరిని హతమార్చింది. ‘ఈ దాడిలో మేజర్ ర్యాంకు అధికారి సహా ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. ఆ తర్వాత అందులో ఒకరు వీర మరణం పొందారు’ అని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. కొన్నాళ్లుగా పాక్ BATs చొరబాట్లకు యత్నిస్తున్నాయి. వీటిలో ఉగ్రవాదులతో పాటు Rtd ఆర్మీ జవాన్లూ ఉంటున్నారు.
Similar News
News November 24, 2025
బేబీ కార్న్ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<


