News August 30, 2024

వన్డేల్లో 99 పరుగుల వద్ద ఔటైన భారత బ్యాటర్లు

image

*1984- క్రిస్ శ్రీకాంత్ vs ఇంగ్లండ్
*2002- VVS లక్ష్మణ్ vs వెస్టిండీస్
*2004- రాహుల్ ద్రవిడ్ vs పాకిస్థాన్
*2007లో సచిన్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్‌పై 3 సార్లు 99పై ఔటయ్యారు.
*2013- విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్
*2016- రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా

Similar News

News February 7, 2026

మంత్రాలు చదవాలా, ఉచ్ఛరించాలా?

image

బుద్ధిని పెంచుకోవడానికి ‘గ్రంథాలు’ చదవాలి. ఏకాగ్రత, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపడానికి స్తోత్రాలు ‘పఠించాలి’. అనుకున్న ఫలితం సిద్ధించాలంటే అక్షర దోషం లేకుండా మంత్రాన్ని ‘ఉచ్ఛరించాలి’. దేవునితో అనుబంధాన్ని, శరణాగతిని పొందాలంటే ఆయన గుణాలను ‘స్తుతించాలి’. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రేమతోనే ఆయన నామాన్ని ‘పలకాలి’. తద్వారా దైవ సాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చు. ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన భక్తి సాధ్యం.

News February 7, 2026

AI కోసం టెక్‌ దిగ్గజాల ₹58 లక్షల కోట్ల రిస్క్!

image

AI రేసులో గెలవడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలు 2026లో ఏకంగా $700 బిలియన్లు (సుమారు ₹58 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 60% ఎక్కువ. డేటా సెంటర్లు, చిప్స్ కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుల వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోగా.. కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గి అప్పులు పెరుగుతున్నాయి.

News February 7, 2026

APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

image

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.