News June 5, 2024

ఐర్లాండ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు

image

T20WC: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ష్‌దీప్, హార్దిక్ ధాటికి ఆ జట్టు టాపార్డర్ కకావికలమైంది. 16 ఓవర్లు ఆడి 96 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 3, అర్ష్‌దీప్ 2, బుమ్రా 2, అక్షర్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఆ జట్టులో గారెత్ డెలానీ (26)దే అత్యధిక స్కోరు.

Similar News

News January 4, 2026

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం MAR 3న మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేసింది. ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని, భక్తులు గమనించాలని TTD కోరింది.

News January 4, 2026

ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్‌లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.

News January 4, 2026

సుదర్శన చక్రం నుంచి దుర్వాసుడు ఎలా తప్పించుకున్నాడు?

image

సుదర్శన చక్రం నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి దుర్వాసుడు బ్రహ్మ, శివుని వేడుకుంటాడు. కానీ వారు చేతులెత్తేస్తారు. చివరికి విష్ణుమూర్తిని శరణు కోరగా ‘నా భక్తులే నా హృదయం. అంబరీషుడిని క్షమాపణ కోరితేనే విముక్తి’ అని చెబుతారు. దీంతో దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడతాడు. దయామయుడైన అంబరీషుడు ప్రార్థించడంతో సుదర్శన చక్రం శాంతించి వెనక్కి వెళ్తుంది. భక్తుని పట్ల అహంకారం పనికిరాదని దుర్వాసుడు గ్రహిస్తాడు.