News January 26, 2025
అదరగొట్టిన భారత బౌలర్లు

ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.
Similar News
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.
News November 27, 2025
మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ కౌంటర్

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. SAతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోవడంపై “డోంట్ వర్రీ వసీం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు”అని వాన్ అన్నారు. దీనిపై స్పందించిన జాఫర్..”నా బాధ త్వరలో తీరిపోతుంది. కానీ నువ్వు మరో 4 టెస్టులు భరించాలి”అని యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.


