News June 2, 2024
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు
భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, అమిత్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లియు చువాంగ్‌పై అమిత్ విజయం సాధించారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో మరైన్ కమరాను 5-0 తేడాతో జైస్మిన్ చిత్తు చేశారు. దీంతో వీరిద్దరూ పారిస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. కాగా ఈ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 7, 2025
కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!
పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె పేరెంట్స్ తమిళనాడు, పంజాబ్‌కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.
News January 7, 2025
నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ
UPలో కుంభమేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్రభుత్వం బెంగాల్‌లో జరిగే గంగాసాగర్ మేళాకు ఎందుకివ్వదని CM మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్‌కు నీటి మార్గంలో చేరుకోవాలన్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా నది-బంగాళాఖాతం కలిసే చోటును గంగాసాగర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాతర జరుగుతుంది.
News January 7, 2025
జనవరి 07: చరిత్రలో ఈరోజు
* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం(ఫొటోలో)