News October 31, 2024
స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు
దేశ సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. LAC వెంట భారత బలగాలు దీపావళి ఉత్సవాలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నాయి. కాగా ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ఇటీవల ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య గస్తీ ఒప్పందం కుదిరింది. దీంతో లద్దాక్‌లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి.
Similar News
News November 17, 2024
కొడాలి నానిపై కేసు నమోదు
AP: మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ థర్డ్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, సోషల్ మీడియా శ్రేణులపై కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
News November 17, 2024
తండ్రి మృతి.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2024
లగచర్ల ఘటనలో రిమాండ్‌కు మరో నలుగురు.. కలెక్టర్‌కు భద్రత పెంపు
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా, కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.