News April 21, 2024

ఇండియన్ సినిమాకు 111 ఏళ్లు

image

భారతీయ తొలి సినిమా ‘రాజాహరిశ్చంద్ర’ సరిగ్గా ఇదే రోజు 1913లో విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే తెరకెక్కించిన ఈ మూవీని తొలుత ముంబైలో ప్రదర్శించారు. రామాయణ మహాభారతాల్లో పేర్కొన్న రాజు హరిశ్చంద్రుడి గురించి ఇందులో చూపించారు. ఈ మూవీ కంటే ముందు ‘పుండలీక్’ 1912లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లంతా విదేశీయులు కావడంతో ‘రాజాహరిశ్చంద్ర’ భారత తొలి సినిమాగా పరిగణితమవుతోంది.

Similar News

News October 15, 2024

కలికితురాయి అంటే?

image

కీర్తికిరీటంలో మరో కలికితురాయి అంటూ వార్తల్లో వింటుంటాం. అయితే, చాలా మందికి దీని అర్థం తెలియదు. ‘కలికితురాయి’ అంటే
కొంగ తల ఈకలతో చేసిన శిరోభూషణము అని అర్థం. వివరంగా చెప్పాలంటే.. కలికి అంటే మనోహరమైన, తురాయి అంటే పక్షి ఈక లేదా పువ్వుతో తయారుచేసిన మకుటాలంకారం. ఎవరైనా ఏదైనా అవార్డును, ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తి “కీర్తి కిరీటంపై కలికితురాయి ” అనే నానుడిని వాడతారు.

News October 15, 2024

గురుకులాలను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర?: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News October 15, 2024

పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్

image

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.