News March 17, 2024
పాకిస్థాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

పాక్ నుంచి వచ్చిన 18మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.
Similar News
News March 29, 2025
INDలో 86వేల మంది వద్ద రూ.86 కోట్ల ఆస్తి!

ప్రపంచంలో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌లు ఉన్నాయి. అమెరికాలో 9,05,413 మంది, చైనాలో 4,71,634, జపాన్‌లో 1,22,119, ఇండియాలో 85,698, జర్మనీలో 69,798, కెనడాలో 64,988, యూకేలో 55,667 మంది వద్ద $10Mల సంపద ఉంది.
News March 29, 2025
రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్

AP: రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్‌లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
News March 29, 2025
NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: సీఎం చంద్రబాబు

AP: తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని CM చంద్రబాబు తెలిపారు. ‘పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ TDP. NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. TDPని లేకుండా చేయాలని చూసినవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని అన్నారు.