News January 10, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్
టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
Similar News
News January 10, 2025
‘జేఈఈ అడ్వాన్స్డ్’ రెండు ఛాన్సులే.. సుప్రీంకోర్టు తీర్పు
JEE అడ్వాన్స్డ్-2025 పరీక్షలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3సార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చని గతంలో ప్రకటించిన జాయింట్ అడ్మిషన్ బోర్డు మళ్లీ రెండుసార్లకే పరిమితం చేయడంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. JAB నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. వచ్చే మేలో జరిగే పరీక్షకు 2024, 2025 MARలో ఇంటర్ పాసైనవారే అర్హులు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి JEE అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు.
News January 10, 2025
కంగ్రాట్స్ డియర్ హస్బెండ్: ఉపాసన
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన నేపథ్యంలో సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ పలు వెబ్సైట్స్ రాసిన రివ్యూలను షేర్ చేశారు. ‘కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలోనూ నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్. లవ్ యూ’ అని రాసుకొచ్చారు.
News January 10, 2025
తెలుగు యూట్యూబర్కు 20 ఏళ్ల జైలు
AP: తెలుగు యూట్యూబర్ భార్గవ్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. కాగా భార్గవ్ ‘ఫన్ బకెట్’ పేరుతో వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.